ఇండస్ట్రీలో హీల్స్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న శ్రీలీల..

by Sujitha Rachapalli |
ఇండస్ట్రీలో హీల్స్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్న శ్రీలీల..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ శ్రీలీల మళ్లీ స్పీడ్ పెంచేసింది. ఎన్ని డిజాస్టర్స్ తన ఖాతాలో పడినా అందానికే ప్రయారిటీ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో ఆటోమేటిక్ గా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. మొత్తానికి తన కెరీర్ కు ఎలాంటి ఢోకా లేదని అర్థమైపోవడంతో పాటు పక్క ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు రావడంతో ఖుష్ అవుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తన కోస్టార్స్ తో మంచి రాపో మెయింటేన్ చేసే శ్రీలీల.. హీరోయిన్ ఫరియా అబ్దుల్లాకు బర్త్ డే విషెస్ తెలుపుతూ తాజాగా స్పెషల్ పోస్ట్ పెట్టింది.

ఫరియతో నిల్చున్న ఫొటో షేర్ చేసిన ఆమె.. ' డార్లింగ్ హ్యాపీ బర్త్ డే.. నీ వార్డ్ రోబ్ లో హీల్స్ బ్యాన్ చేయాలి. నేను చూడు ఎలా కనిపిస్తున్నానో నీ పక్కన ' అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ఇందులో ఫరియ బ్లాక్ డ్రెస్ లో కనిపించగా.. శ్రీలీల పింక్ ఫ్రాక్ లో మెరిసింది. జీబ్రా మాదిరిగా పొడుగ్గా ఉన్న తనను తల ఎత్తి పైకి చూస్తున్న చిన్ని ఎలుక పిల్లలా ఉన్న డ్రాయింగ్ కూడా జత చేసింది. మొత్తానికి వీరిద్దరి మధ్య ఎంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉందో ఈ పోస్ట్ చెప్తుంది.


Advertisement

Next Story

Most Viewed