Sreeleela : రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిన శ్రీలీల

by Sujitha Rachapalli |   ( Updated:2024-06-25 11:57:27.0  )
Sreeleela : రెండు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిన శ్రీలీల
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ శ్రీలీల పని అయిపోయిందనుకున్న టైంలో మరింత దూసుకుపోయేందుకు సిద్ధం అవుతుంది. ఇప్పటికే తమిళ్ లో క్రేజీ ఛాన్స్ లు కొట్టేసిన బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సూపర్ డూపర్ అవకాశాలు చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతుండగా.. ఇందులో హీరోయిన్ గా ఈ భామనే ఫైనల్ చేసినట్లు సమాచారం. హిందీ ఇండస్ట్రీకి ఫ్రెష్ ఫేస్ కావాలనే ఉద్దేశ్యంతో తనను ఎంచుకున్నట్లు టాక్. కాగా వరుణ్ ధావన్ హీరోగా చేస్తున్న కామెడీ జోనర్ ఫిల్మ్ కు కూడా శ్రీలీల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక కోలీవుడ్ లో విజయ్ దళపతి సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న బ్యూటీ... స్టార్ హీరో అజిత్ చిత్రంలో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ సినిమాలు సక్సెస్ అయితే ఈ తెలుగమ్మాయి ఇతర ఇండస్ట్రీల్లో ఓ వెలుగు వెలగడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story