పండగ వేళ పద్ధతిగా మెరిసిన శ్రీముఖి.. అదిరిపోయే హాఫ్ శారీ పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-09-19 06:18:10.0  )
పండగ వేళ పద్ధతిగా మెరిసిన శ్రీముఖి.. అదిరిపోయే హాఫ్ శారీ పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాక్ టు బ్యాక్ ప్రోగామ్స్‌తో జనాలను అలరిస్తుంది బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. ఇటీవలే చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో ‘కీర్తి సురేష్’ ఫ్రెండ్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ అమ్మడు ఫొటో షూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తరచూ బ్యూటీఫుల్ స్టన్నింగ్ స్టిల్స్‌తో.. ఆకట్టుకునే డ్రెస్సింగ్ స్టైల్‌తో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంటుంది. మరీ ముఖ్యంగా ప్రత్యేకమైన రోజు, పండగ వేళల్లో అయితే సంప్రదాయ దస్తుల్లో మరింత కలర్‌ఫుల్‌గా మెరుస్తుంది.

నిన్న (సెప్టెంబరు 18) వినాయక చవితి సందర్భంగా ఈ భామ హాఫ్ శారీలో బుట్టబొమ్మలా ట్రెడిషన్ లుక్‌తో ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. పట్టుపరికిణీతో పాటు ఆకర్షణీయమైన జ్యూవెలరీ ధరించి.. నెటిజన్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. నిండు దుస్తుల్లో చక్కటి రూపంలో ఉన్న ఈ అమ్మడు.. ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకోగా.. తన అభిమానులకు ‘గణేష్ చతుర్థి’ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Read More..

మున్ముందు అత్యంత దారుణంగా సమంత పరిస్థితి.. జాతకంలో అసలు ఏముందో తెలుసా?












Advertisement

Next Story