మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?

by Prasanna |
మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?
X

దిశ, సినిమా : తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి సందD, ధమాకా మూవీస్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్స్ తో దూసుకెళ్లింది. గతేడాది ఆరు సినిమాలకు పైగా చేసింది కానీ, వీటిలో అన్ని హిట్ కాలేకపోవడంతో డిమాండ్ కొంచం తగ్గింది. దీంతో, ఇక అప్పటి నుంచి తెలుగులో ఈమెకి స్టార్ హీరోల సరసన పెద్దగా ఆఫర్స్ రాలేదు. ఇదిలా ఉండగా, తాజాగా ఈ హీరోయిన్ సంబందించిన ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అదేంటో ఇక్కడ చూద్దాం..

మెగాస్టార్ మూవీనే రిజెక్ట్ చేసిందని సమాచారం. ఈ న్యూస్ టాలీవుడ్లో బాగా వైరల్ అవుతుంది. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆమె దగ్గరకి వెళ్ళారని టాక్. కానీ ఆమె మొహమాటం లేకుండా నో చెప్పిందని సినీ వర్గాల నుంచి సమాచారం. రెమ్యునరేషన్ అడిగిందాని కంటే ఎక్కువ ఇస్తామని చెప్పినా చేయను అని చెప్పేసిందట. అయితే, శ్రీలీల ఐటం సాంగ్స్ చేసేందుకు రెడీగా అందుకే ఇది రిజెక్ట్ చేసినట్లు సినీ పెద్దలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed