Sreeleela: ఎవరూ ఊహించని యాడ్‌లో శ్రీలీల.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో)

by Anjali |
Sreeleela: ఎవరూ ఊహించని యాడ్‌లో శ్రీలీల.. షాక్‌లో ఫ్యాన్స్ (వీడియో)
X

దిశ, సినిమా: ‘పెళ్లి సందడి’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఓ ఊపు ఊపింది కుర్ర హీరోయిన్ శ్రీలీల. తర్వాత ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశం దక్కించుకుని అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ‘జేమ్స్, ధమాకా, స్కంద, భగవంత కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం’ వంటి సినిమాల్లో నటించి టాలీవుడ్ ను ఏలుతోందనడంలో అతిశక్తిలేదు. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక.. సీనియర్ స్టార్ హీరోయిన్లను సైతం పక్కన పెట్టి.. ఈ అమ్మడు చుట్టే తిరిగారు దర్శక, నిర్మాతలు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో రెండు మూవీస్ మాత్రమే ఉన్నాయి. స్టార్టింగ్‌కు ఇప్పటికి సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల షాప్ ఓపెనింగ్స్ కు, పలు ఈవెంట్లకు హాజరవుతూ లైఫ్ ను ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ యాడ్ లో కూడా నటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా శ్రీలీలనే తన ఇన్‌స్టాగ్రామ్ వేదికన అభిమానులతో పంచుకుంది. ఈ యాడ్ చూసినట్లైతే.. శ్రీలీల శాస్త్రి బామ్ అనే బ్రాండ్‌ కోసం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఈ భామ నాట్యం చేస్తూ.. అటు ఇటు తిరుగుతూ తనతో నాట్యం చేస్తోన్న అమ్మాయికి పెయిన్ వస్తే బామ్ తెచ్చి ఇవ్వడం మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు శ్రీలీల ఇలాంటి యాడ్స్ చేస్తుందని ఊహించలేదంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed