ఆమె వీధుల్లో పిచ్చిదానిలా తిరిగేది.. సీనియర్ నటి పై శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్..

by Kavitha |
ఆమె వీధుల్లో పిచ్చిదానిలా తిరిగేది.. సీనియర్ నటి పై శ్రీలక్ష్మి షాకింగ్ కామెంట్స్..
X

దిశ, సినిమా: సీనియర్ నటి శ్రీలక్ష్మి.. ఇమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నటిగానే కాకుండా కమెడియన్‌గా ఆమె మనందరికీ సుపరిచితమే. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ భాషల్లో దాదాపు 500కు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది శ్రీలక్ష్మి. ఇది ఇలా ఉంది తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలక్ష్మి నటి రమాప్రభ గురించి ఎన్నో విషయాలు పంచుకుంది. ‘శరత్ బాబుతో విడిపోయాక రమప్రభ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. ఆమె వీధుల్లో పిచ్చి పట్టినదానిలా తిరిగేది. ఆ సమయంలో తనకు దగ్గరగా ఉన్నాను. ఓ రోజు ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమా 100 రోజుల వేడుకకు ఇద్దరం హాజరయ్యాము. తను నిద్ర మాత్రలు వేసుకుందో ఏమో తెలియదు.. కానీ, మత్తుగా ఆ వేడుకకు వచ్చింది.

ఏం చేస్తుందో తెలియట్లేదు. ఈమెకు మెంటల్ వచ్చిందా ఏంటి? అనిపించింది. ఒక ఇంటి దగ్గర చిన్న డప్పు వాయిస్తూ బాబా గురించి పాట పాడుతూ ఉంది. ఆమె ఎక్కడికి వెళ్లినా బాబా జపం మానడం లేదు. బాబా స్మృతులు, బాబా పాటలు వీటితోనే తను గడిపేస్తుండేది. బాబా లేడంటే రమాప్రభ లేదు. ఇక ఆమెను చూసి నేను కూడా బాబాను తలుచుకోవడం మొదలు పెట్టాను. ఆయన అందరి పట్ల ఉంటాడు అని భావించాను. అందుకే ఆయన మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాను. నేను ఏ పని చేసినా బాబాను నమ్ముకునే చేస్తాను. ఆయన అనుగ్రహంతో అడుగు బయటకు వేస్తాను. ఆయన లేకుండా నేను లేను అని నమ్ముతున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రీలక్ష్మి.

Advertisement

Next Story