శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన మానస్‌ భార్య శ్రీజ.. ఎందుకో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-09-24 04:30:30.0  )
శ్రీముఖికి వార్నింగ్ ఇచ్చిన  మానస్‌ భార్య శ్రీజ.. ఎందుకో తెలుసా?
X

దిశ,వెబ్ డెస్క్: స్టార్ మా ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివార్’ షో కి యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌కి స్టార్ మా సీరియల్ బ్యాచ్ అంతా వచ్చారు. వారిలో బ్రహ్మముడి మానస్, కావ్య ఉన్నారు. అయితే మానస్‌ని సరదాగా ఆట పట్టించారు. మానస్ ఈ మధ్య శ్రీజతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీముఖి అతనికి కాబోయే భార్యకి ప్రాంక్ కాల్ చేసింది.

శ్రీజకి ఫోన్ చేసి.. ‘హలో.. మానస్ వాళ్ల గర్ల్ ఫ్రెండ్‌ని మాట్లాడుతున్నా? అని శ్రీముఖి అనడంతో.. అవునా ‘ఎన్నో గర్ల్ ఫ్రెండ్’ అంటూ రివర్స్ పంచ్ వేసింది శ్రీజ. ఆ మాటకి శ్రీముఖి షాక్ అయింది. నేను ‘ఎన్నో గర్ల్ ఫ్రెండ్‌నా?? ఏంటి మానస్ నడుమ గిల్లుతున్నావ్.. దూరంగా వెళ్లు' అని అంటుంది. అప్పుడు మన రాములమ్మ నా పేరు పక్కన నాలుగు హార్ట్స్ పెట్టాడు తెలుసా? అని అంటే.. ‘నా చేతికి రింగ్ పెట్టాడు’ అంటూ శ్రీముఖికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్లు శ్రీజ ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా శ్రీముఖి ఇంకా మాట్లాడుతుందా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Read More: Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా అంటే ఇదేనా.. లీకైన టాప్ 5 అగ్రిమెంట్.. ముందే అంతా ఫిక్స్?

Advertisement

Next Story