బూతులు, గ్లామర్ డోస్‌తో నిండిపోయిన ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్

by Kavitha |   ( Updated:2024-03-16 15:33:01.0  )
బూతులు, గ్లామర్ డోస్‌తో నిండిపోయిన ‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ని మొదలు పెట్టి హీరోగా డిఫరెంట్ కథలు ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తాజాగా ‘ఓం భీమ్ బుష్’ అనే మూవీతో రాబోతున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముక్యపాత్రలో నటిస్తున్న ఈ మూవీ కొత్త పాయింట్‍లో తీసుకొస్తున్నాడు దర్శకుడు హర్ష కొనుగంటి. కాగా ఇప్పటికే టీజర్ విడుదలకాగా ఇంట్రెస్టింగ్‍గా సాగడంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి నేడు (మార్చి 15) ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ఇక ఈ ట్రైలర్ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా ఉంది.. ‘నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్’ అనే ట్యాగ్‍లైన్‍కు తగ్గట్టుగానే స్టోరీ విచిత్రమైన మలుపులు తిరుగుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మరోసారి కామెడీ టైమింగ్‍తో అదరగొట్టారు. హీరో శ్రీవిష్ణు కొత్త కోణంలో కనిపపించాడు డైలాగ్ డెలివరీని మరోలాగా చూపించారు. అలాగే ఈ మూవీలో గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డైలాగ్‍ల్లో అక్కడక్కడా కొన్ని బూతులు కూడా వినిపించాయి. చివర్లో ఈ ముగురు సంపంగి మహల్‍లోకి వెళ్లాక అక్కడ ఫన్ బాగుంది. ఇక చివర్లో భైరవ పురం అని ప్రియదర్శి ఫ్రస్టేట్ అవడంతో ట్రైలర్ ఎండ్ అయింది.


Read More..

‘దేవర’ నుంచి ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త..

Advertisement

Next Story