‘స్పై’ సుభాష్‌ చంద్రబోస్‌ బయోపిక్ కాదు.. దేశ భక్తి చిత్రం: గ్యారీ బిహెచ్

by Harish |   ( Updated:2023-05-16 15:48:03.0  )
‘స్పై’ సుభాష్‌ చంద్రబోస్‌ బయోపిక్ కాదు.. దేశ భక్తి చిత్రం: గ్యారీ బిహెచ్
X

దిశ, సినిమా: నిఖిల్ సిద్ధార్థ్, రా ఏజెంట్‌గా నటిస్తున్న చిత్రం ‘స్పై’. గ్యారీ బిహెచ్ డైరెక్షన్‌లో ఈడీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్‌పై కె రాజశేఖర్ రెడ్డి, సిఇఓగా చరణ్ తేజ్ ఉప్పలపాటి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల న్యూ ఢిల్లీ‌లోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం కర్తవ్య పథ్ వద్ద రిలీజ్ చేసిన మూవీ టీజర్ 3 మిలియన్ వ్యూస్‌కు చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన డెబ్యూ సినిమా నిఖిల్‌‌తో చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన గ్యారీ బిహెచ్‌.. జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమాను ఆశీర్వదించాలని కోరాడు.

అలాగే హీరో నిఖిల్‌ సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘‘స్పై’ ఫస్ట్‌ మిషన్‌ అని పెట్టడానికి కారణం మీడియాతో ఇంట్రాక్ట్‌ కావడం కోసమే. ఎన్ని హిట్లు వచ్చినా ప్రతి సినిమా కొత్త ప్రయత్నమే. ఈ మూవీకి హీరో కథనే. టీజర్‌‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చినందుకు హ్యాపీగా ఉంది’ అన్నాడు. చివరగా శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్‌, వంశీ పచ్చిపులుసు, చరణ్‌తేజ్‌ ఉప్పలపాటి, నితిన్‌ మెహతా, రాబిన్‌ సుబ్బు, సాన్య ఠాకూర్, ఐశ్వర్య మీనన్‌, అనిరుధ్‌ కృష్ణమూర్తి, అభినవ్‌ గోమటం తదితరులు ‘స్పై’ బిగ్ హిట్ అవుతుందంటూ మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇవి కూడా చదవండి : ఇలాంటి సినిమాకు సంగీతం అందించడం ఓ ఛాలెంజ్: మిక్కీ జె మేయర్

Advertisement

Next Story