విశ్వరూపం చూపించిన హీరో గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-31 15:56:07.0  )
విశ్వరూపం చూపించిన హీరో గోపీచంద్.. వైరల్ అవుతున్న వీడియో
X

దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్, స్టైలిష్ డైరెక్టర్ శ్రీను వైట్ల అప్ కమింగ్ మూవీ 'విశ్వం' ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. ' ది జర్నీ ఆఫ్ విశ్వం ' పేరుతో వీడియో రిలీజ్ చేశారు. వండర్ ఫుల్ విజువల్స్, డైనమిక్‌ అండ్ స్టైలిష్ కొరియోగ్రఫీ యాక్షన్ సన్నివేశాలతోపాటు ప్రేక్షకులను అలరించే ఇంపార్టెంట్ హ్యుమర్ సీక్వెన్స్ ఈ క్లిప్పింగ్ లో యాడ్ చేశారు. ఆడియన్స్ లో ఎగ్జయిట్మెంట్ పెంచడంలో సక్సెస్ అయ్యారు. శ్రీను వైట్ల మార్క్ హ్యుమర్, యాక్షన్‌, కామెడీ ని అద్భుతంగా బ్యాలెన్స్ చేయగా... అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు.

గోపీచంద్ యాక్టింగ్, స్టైలిష్ లుక్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్, హ్యూమరస్ టచ్ తో అదరగొట్టగా.. కావ్యా థాపర్ లీడింగ్ లేడిగా కనిపించనుంది. కాగా ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు

Advertisement

Next Story