కల్కిలో మాళవిక క్యారెక్టర్ ఇదే.. సినిమా రిలీజ్ కు ముందే అప్రిసియేషన్ పోస్టులు

by Sujitha Rachapalli |
కల్కిలో మాళవిక క్యారెక్టర్ ఇదే.. సినిమా రిలీజ్ కు ముందే అప్రిసియేషన్ పోస్టులు
X

దిశ, సినిమా: మాళవికా నాయర్.. ఏ పాత్ర చేసినా ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేస్తుంది. పదిహేను ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ హీరోయిన్.. తన క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేస్తుందనే ప్రశంసలు ఇంతకు ముందే అందుకుంది. అయితే ఈ బ్యూటీ 'Kalki 2898 AD' సినిమాలో అభిమన్యుడి భార్య ఉత్తరగా కనిపించబోతుంది. రిలీజ్ ట్రైలర్ లో ఓ ఐకానిక్ షాట్ లో నిజంగానే దేవతగా కనిపించింది. దీంతో ఆమె గతంలో చేసిన పాత్రలను పోస్ట్ చేస్తూ పొగుడుతున్నారు నెటిజన్లు. ఒక్క సీన్ లో కనిపించినా షో స్టీలర్ గా మారుతుందని తన గురించి స్పెషల్ అప్రిసియేషన్ పోస్టులు పెడుతున్నారు.

కాగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న కల్కిలో మరోసారి ఆమెకు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ పడిందనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే మహాభారతంలో ఉత్తర కడుపులో ఉన్న చివరి వారసుడిని చంపేందుకు కౌరవుల తరఫున యుద్ధం చేసిన అశ్వత్థామ అస్త్రం ప్రయోగిస్తాడు. ఇది చూసిన కృష్ణ పరమాత్ముడు ఎలాంటి ఆపద రాకుండా అడ్డుకుంటాడు. ఈ సీన్ కచ్చితంగా ఈ మూవీలో ఉంటుందని.. డైరెక్టర్ ఎంత గొప్పగా చిత్రీకరించాడో చూడాలని ఉందని అంటున్నారు ఆడియన్స్. మొత్తానికి అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా.. ఉత్తరగా మాళవిక కనిపించబోతుంది కాబట్టి వీరిద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. జూన్ 27న థియేటర్స్ లో ఎంజాయ్ చేసేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed