ఏ యాస మాట్లాడాలో మీరే చెప్పండి: నెటిజన్ ప్రశ్నకు నటి కౌంటర్

by Prasanna |   ( Updated:2023-01-20 12:07:24.0  )
ఏ యాస మాట్లాడాలో  మీరే చెప్పండి: నెటిజన్ ప్రశ్నకు నటి కౌంటర్
X

దిశ, సినిమా : సెక్సీ యాక్ట్రెస్ సోఫీ చౌదరి ఓ నెటిజన్ ప్రశ్నకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చింది. ఇటీవల ఇండోనేషియాలో ఓ ఈవెంట్‌లో పొల్గొనేందుకు వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట పోస్ట్ చేసింది. అది కాస్త వైరల్ అవడంతో ఇన్‌స్టా ఫాలోవర్ స్పందిస్తూ.. 'వై దట్ అక్సెంట్ లివింగ్ ఇన్ ఇండియా?!?' అని అడిగాడు. దీనికి వెంటనే రియాక్ట్ అయిన నటి.. 'నేను ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగాను. పారిస్‌లో చదువుకున్నా. భారతదేశంలో పని చేస్తున్నా. నేను ఏ యాసను ఫాలో కావాలి? ఒకే యాస మాట్లాడాలని ప్రజలు ఆశించడం సహజం. కానీ, వారి పెంపకమనేది చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంతంలో పరిశీలనాత్మకంగా, ఒక నిర్దిష్ట మార్గంలో ఉన్నప్పుడే అలా మాట్లాడాలని ఆశించండి' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి : అక్కినేని అఖిల్‌పై ఇంట్రెస్ట్.. అందరి ముందు ఓపెన్ అయిన హీరోయిన్

Advertisement

Next Story