Jiah Khan: జియా ఖాన్ కేసులో తుది తీర్పు.. పదేళ్ల తర్వాత ప్రియుడికి విముక్తి

by Prasanna |   ( Updated:2023-04-28 14:49:19.0  )
Jiah Khan: జియా ఖాన్ కేసులో తుది తీర్పు.. పదేళ్ల తర్వాత ప్రియుడికి విముక్తి
X

దిశ, సినిమా : నటి జియా ఖాన్ మరణం కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించింది. 2013లో జియా తన ఇంట్లోనే హ్యాంగ్ చేసుకోగా.. నటుడు సూరజ్ పంచోలి తన కూతురి ఆత్మహత్యకు కారణమని తల్లి రబియా ఖాన్ ఆరోపించింది. దీంతో జూన్‌లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. నెల రోజుల తర్వాత బెయిల్ మంజూరు అయింది. అయితే ఈ పదేళ్ల కాలం తర్వాత తీర్పునిచ్చిన కోర్టు.. సూరజ్‌పై ఆరోపణలకు విముక్తి కల్పించింది. కాగా సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ అభియోగాల నుంచి బయటపడిన సూరజ్.. ‘నిజం ఎప్పుడూ గెలుస్తుంది. దేవుడు గొప్పవాడు’ అంటూ సోషల్ మీడియా పోస్ట్ పెట్టాడు. అయితే లైవ్ లా ప్రకారం, తీర్పుపై అప్పీల్ చేసుకునే హక్కు జియా తల్లి రబియా ఖాన్‌కు ఉందని తెలిపింది న్యాయస్థానం.

Also Read..

OTT: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ, తమిళ సినిమాలివే!

Advertisement

Next Story

Most Viewed