ఆడవాళ్లు తొడలను భర్తలకే చూపించాలా.. స్వేచ్ఛ కావాలంటున్న సోన్యా

by Hamsa |   ( Updated:2022-09-15 10:00:14.0  )
ఆడవాళ్లు తొడలను భర్తలకే చూపించాలా.. స్వేచ్ఛ కావాలంటున్న సోన్యా
X

దిశ, సినిమా: టెలివిజన్ నటి సోన్యా అయోధ్య సామూర్ మేల్ కో‌స్టార్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు 'కసౌతీ జిందగీ కే 2' సెట్‌లో తనను ఓ వ్యక్తి టార్చర్ చేస్తూ సాధారణ మగాడి బుద్ధి చూపించాడని ఎమోషనల్ అయింది. 'ఓ సన్నివేశంలో భాగంగా నా శరీరాన్ని కప్పి ఉంచమని కోరాడు. అంతటితో ఆగకుండా ఆడవాళ్లు కాళ్లను ఆడించవద్దన్నాడు. తర్వాత తొడలను పూర్తిగా బట్టలతో కప్పేయమన్నాడు. ఎందుకంటే అవి భర్తలకు మాత్రమే చూపించాలని ఉపదేశమిచ్చాడు.

అంతేకాదు మగ మతోన్మాదిగా వ్యవహరిస్తూ మహిళలు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. బాడీ స్ట్రక్చర్, డ్రెస్సింగ్, ఆహార ఎంపికలతోపాటు మతం విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది' అంటూ ఎమోషనల్ అయింది. ఇక షూటింగ్ సమయంలోనూ సెట్‌లో గంటల తరబడి వేచి ఉండేలా చేశాడన్న నటి.. ఇది వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

Also Read : నిర్మాతలతో సెక్స్ చేస్తేనే ప్రతిఫలం.. ఎఫైర్ పెట్టుకోకపోతే రాణించడం కష్టమే!

Advertisement

Next Story