చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా..

by sudharani |
చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా..
X

దిశ, సినిమా: సదన్‌, ప్రియాంక ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రణయగోదారి'. పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మరో బ్యూటీఫుల్‌ మెలోడి సాంగ్‌ చూడకయ్యో.. నెమలికళ్ళ అనే పాటను ఆస్కార్‌ అవార్డ్‌ విన్నర్‌ ప్రముఖ లిరిసిస్ట్‌ చంద్రబోస్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పుడే పాట విన్నాను.. చూడకయ్యో.. నెమలికళ్ళ తూగుతున్న తూనీగల్లా అనే పల్లవితో కొనసాగే ఈ పాటలో మంచి సాహిత్యం, సంగీతం వుంది. మార్కండేయ ఈ పాటకు చక్కని సాహిత్యంతో పాటు ఆకట్టుకునే స్వరకల్పన చేశాడు.

చక్కటి జానపద సాహిత్యం ఇది. అందరికి చేరువయ్యే తేలికైన మాటలతో.. వినగానే రసానుభూతి కలిగించేలా మంచి సాహిత్యం అందించారు. పాట బాణీతో పాటు నడక, దాని వెనకాల వచ్చే బీట్‌ కూడా నాకు బాగా నచ్చింది. గాయనీ సునీత, సాయిచరణ్‌ తన గాత్రంతో పాటకు జీవం పోశారు. నాకు ఈ మధ్య కాలంలో అమితంగా నచ్చిన పేరు 'ప్రణయగోదారి' టైటిల్‌ చాలా కవితాత్మకంగా వుంది. చిత్రం కూడా అంతే వుంటుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పాటతో పాటు చిత్రం కూడా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నాను' అన్నారు.

Next Story

Most Viewed