మన దేశంలో మహిళలకు గుర్తింపు దక్కట్లేదు: సోనమ్

by sudharani |   ( Updated:2023-02-19 10:00:03.0  )
మన దేశంలో మహిళలకు గుర్తింపు దక్కట్లేదు: సోనమ్
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ సీనియర్ నటి సోనమ్‌ దాదాపు 30 ఏళ్ల తర్వాత అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. త్రిదేవ్‌, విశ్వాత్మ, అజూబా వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అర్ధాంతరంగా సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అయితే ఓ ఓటీటీ షోతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. 'లాక్‌డౌన్‌లో ఓటీటీలో షోలు, సిరీస్‌లు చూశాక ఇలాంటివి నేనెందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది.

2018 తర్వాత బరువు పెరగడం ప్రారంభించా. అలా ముప్పై కిలోలు తగ్గి 32 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నా. పద్నాలుగేళ్లకే పనిలో దిగినప్పటికీ 19ఏళ్లకే గర్భం దాల్చాను. జీవితంలో కష్టసుఖాలెన్నో చవిచూశాను. అన్నింటినీ దాటుకుంటూ పోవాలి. యాబై ఏళ్లకే జీవితం ముగియదు. మన దేశంలో 50 ఏళ్ల వయస్సు వచ్చాక మహిళలు తమ గుర్తింపును కోల్పోతున్నారు. నా శరీరాకృతి తగ్గ అవకాశాలు వస్తే తప్పకుండా నటిస్తాను. కొత్త తరంతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని వివరించింది.

Also Read..

Andrea: వయసు మీద పడ్డా.. నీలో వేడి తగ్గట్లేదు.. ఆండ్రియా బోల్డ్ షోపై కామెంట్స్

Advertisement

Next Story