క్యాన్సర్‌పై పోరాటం.. ఎమోషనల్ అయిన సోనాలి

by samatah |
క్యాన్సర్‌పై పోరాటం.. ఎమోషనల్ అయిన సోనాలి
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే గురించి పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో జతకట్టి మంచి హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది. 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను ఎదుర్కోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. మొత్తానికి క్యాన్సర్‌ను జయించి, తాజాగా మళ్లీ బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రముఖ సోనీ టీవీ ఛానల్‌లో ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్ సీజన్ 3’షోకు జడ్జిగా సోనాలి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో భాగంగా మీడియాతో ముచ్చటించినా ఆమె.. ‘నేను ఒకరికి స్ఫూర్తిగా నిలవాలనుకోను. నేను ఒకరికి ప్రేరణ కలిగిస్తున్నానంటే అది వాళ్ల గొప్పతనం అన్నారు. నా పోరాటం, నా జీవితానికి ఒక అనుభవం అంతే. కానీ, ఈ షోలో చాలామంది చిన్న పిల్లలను చూస్తున్నాను. వారి తల్లిదండ్రుల కష్టాలను వింటున్నా. వారి ముందు నాది అంత పెద్ద సమస్య ఏమీ కాదు. ఇంకా అత్యుత్తమ చికిత్స భరించగలిగే శక్తి నాలో ఉంది. ఆ విషయంలో నన్ను నేను ధన్యురాలిగా భావిస్తాను’ అంటూ ఎమోషనల్ అయింది.

Advertisement

Next Story