రేపిస్ట్ నుంచి ఎవరైనా కాపాడండి అంటూ.. యాంకర్ రష్మి ట్వీట్

by Hamsa |   ( Updated:2023-07-11 04:42:12.0  )
రేపిస్ట్ నుంచి ఎవరైనా కాపాడండి అంటూ.. యాంకర్ రష్మి ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ రష్మి జబర్దస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే రష్మి జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. ఎక్కడ మూగజీవాలు హింసకు గురైనా తనదైన స్టైల్లో స్పందిస్తుంది. అయితే ఇటీవల ఢిల్లీలో ఓ యువకుడు కుక్కపిల్లను వేధిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది.

దీంతో అది చూసిన రష్మి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది. అతను చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదం. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేసింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story