కొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు.. అందుకే కెరీర్ ఇలా అయింది: Payal Rajput

by Hamsa |   ( Updated:2023-07-01 05:24:25.0  )
కొందరు డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు.. అందుకే కెరీర్ ఇలా అయింది: Payal Rajput
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుబ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ‘RX100’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీతోనే బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో అడపా దడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ తన కెరీర్ నాశనం కావడానికి కొందరు వ్యక్తులు కారణమని తెలిపింది. ‘‘నా వరకు నేను ప్రతి సినిమాకు 200 శాతం ఎఫర్ట్స్ పెడతాను. కానీ అవి ఫేవర్‌గా వర్కవుట్ కాకపోవడం నా చేతుల్లో లేదు. అదంతా డెస్టినీ. నిజం చెప్పాలంటే.. ఆర్‌ఎక్స్100 తర్వాత మిస్‌గైడెన్స్ వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. చాలా మంది నన్ను అడ్వాంటేజ్‌గా తీసుకున్న విషయాన్ని నేను కూడా గుర్తించాను. కొంతమంది డైరెక్టర్లు నన్ను వాడుకున్నారు. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది. ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదనే విషయంలో కొంచెం బుర్ర వాడుతున్నాను. ప్యూచర్ ప్రాజెక్టుల కోసం సిక్స్త్ సెన్స్ యూజ్ చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ అనే సినిమాతో రాబోతుంది.

Read more: ఛీ, ఛీ రష్మికకు అంత చెడ్డ అలవాటు ఉందా..సాయంత్రం అయితే అదే పని అంట?

Advertisement

Next Story

Most Viewed