Sobhitha Dhulipala: అక్కినేని అమల చేసిన పని శోభితకు సాధ్యమేనా..? నెట్టింట దుమారం రేపుతోన్న వార్త

by Kavitha |   ( Updated:2024-08-16 14:21:22.0  )
Sobhitha Dhulipala: అక్కినేని అమల చేసిన పని శోభితకు సాధ్యమేనా..? నెట్టింట దుమారం రేపుతోన్న వార్త
X

దిశ, సినిమా: రీసెంట్‌గా అక్కినేని నాగచైతన్య స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ బ్యూటీ. అయితే నాగార్జున మొదట దగ్గుబాటి లక్ష్మిని పెళ్లి చేసుకొని బాబు పుట్టాక ఎలా అయితే విడాకులు ఇచ్చాడో నాగచైతన్య కూడా తన మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చాడు. కానీ, చైతన్యకు సమంతకు పిల్లలు లేరు. ఇన్‌కేస్ ఎవరైనా పిల్లలు పుట్టుంటే నాగచైతన్య లాగే ఆ పిల్లలు కూడా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసేవారు కావచ్చు. ఇది ఒకందుకు మంచిదే అనిపిస్తుంది చైతన్య లైఫ్‌ని చూస్తే.

అయితే ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఓకే ఇంట్లో తల్లిదండ్రులతో నాగచైతన్య ఏనాడు కలిసి ఉండలేదు. అలా చిన్నప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇక నాగార్జున ఎలా అయితే అమలను రెండో పెళ్లి చేసుకొని అక్కినేని ఫ్యామిలీలోకి కోడలుగా తీసుకువచ్చాడో నాగచైతన్య కూడా శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకుని ఆమెను అక్కినేని వంటి బడా ఫ్యామిలీలోకి కోడలుగా తీసుకొస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి.

అందులో భాగంగా అక్కినేని అమల లాగే శోభిత ఆ పని చేయడం సాధ్యమేనా అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ అమల చేసిన పని ఏంటి.. శోభిత చేయాల్సిన పని ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అక్కినేని అమల పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉంది. అయితే తల్లి పాత్రలకు గెస్ట్ పాత్రల్లో నటించింది తప్ప హీరోయిన్‌గా మాత్రం నటించలేదు. అలాగే ఇప్పుడు కోడలుగా వస్తున్న శోభిత కూడా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇంట్లోనే కూర్చుంటుందా లేక సినిమాలు చేస్తుందా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story