ఈ వయసులో అలా ఉండటం నా వల్ల కాదు.. అన్నీ ఆస్వాదించాల్సిందే!

by Anjali |   ( Updated:2023-06-28 09:24:15.0  )
ఈ వయసులో అలా ఉండటం నా వల్ల కాదు.. అన్నీ ఆస్వాదించాల్సిందే!
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ శోభితా ధూళిపాళ తను నటించబోయే ప్రాజెక్టులను ఎంపిక చేసుకునే విధానంపై ఓపెన్ అయింది. ఈ మేరకు సహా నటీమణులవలే పనిలేకుండా ఎక్కువ కాలం వేచి ఉండలేనని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని తానెంటో నిరూపించుకుంటానని చెప్పింది. అలాగే ఫీల్మ్ ఇండస్ట్రీలో స్త్రీల వయసు ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ.. తన వయసు విషయంలో ఎలాంటి ఆందోళన లేదని తెలిపింది. ‘నేను రేసులో లేను. అయితే ఎల్లప్పుడూ విభిన్న భావోద్వేగాలను అందించే కథలు, ప్రాజెక్టుల్లో మాత్రమే నటించాలనుకుంటాను. అలాంటి సినిమాలే తీయాలనుకుంటున్నా. కానీ, వాటికోసం ఏళ్ల తరబడి కాళీగా ఉండలేను. విభిన్నమైన క్యారెక్టర్లు చేయగల సామర్థ్యం కలిగివున్న నటిగానే ప్రేక్షకులు నన్ను చూడాలని ఆశిస్తున్నా’ అంటూ పలు విషయాలు వెల్లడించింది.

Read More: స్త్రీల అందాన్ని కామం, సెక్స్‌తోనే ముడిపెడతారా.. నెటిజన్లపై కాజోల్ సీరియస్

పవన్ కల్యాణ్‌పై మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు


Advertisement

Next Story