ఇంతవరకు ఏ అమ్మాయి సెక్స్ ఇక చాలు ఆపు అని నాతో అనలేదు.. స్టార్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-02 15:08:17.0  )
ఇంతవరకు ఏ అమ్మాయి సెక్స్ ఇక చాలు ఆపు అని నాతో అనలేదు.. స్టార్ డైరెక్టర్ బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మాటలు, చేతలు అన్నీ కాంట్రవర్సీయే. ఆ వివాదాలతోనే ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంటూ బోల్డెంత పబ్లిసిటీ సంపాదిస్తుంటారు. పైసా ఖర్చు లేకుండా ఆర్జీవీ తన ప్రాజెక్ట్‌లకు తెచ్చుకునే హైప్‌ని చూసి మిగతా దర్శకులు కుళ్లుకుంటూ ఉంటారు. బయోపిక్స్, కాంట్రవర్సీ సబ్జెక్ట్‌లతోనే ఆయన సినిమాలు తీస్తుంటారు. ఈ విషయంలో ఏ స్థాయిలో ఒత్తిళ్లు, బెదిరింపులు వచ్చినా వర్మ వినే రకం కాదు. ఒక్కోసారి ఆయన చేష్టలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడే రకం కాదు. ఎవరేమనుకున్నా సరే ,ఏ విషయంపై అయినా సరే ఆయన మాటలు కుండబద్దలు కొట్టినట్లుగా ఉంటాయి. కొందరు వర్మను పిచ్చోడంటే, ఆయన అభిమానులు మాత్రం భావప్రకటన స్వేచ్ఛను సంపూర్ణంగా అనుభవించే ఏకైక వ్యక్తి అంటూ పొగుడుతూ ఉంటారు. అలా ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా.. వర్మ పాపులారిటీ మాత్రం రోజురోజుకు పెరిగిపోతుందే తప్పించి తగ్గడం లేదు. ఆయన సినిమాలు తీయకపోయినా సరే అదే స్టార్‌డమ్ కంటిన్యూ అవుతోందంటే ఆశ్చర్యం కలగకమానదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ గోపాల్ వర్మ.. సెక్స్, వర్జినిటీ లాంటి అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను నా 17, 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే వర్జినిటీని కోల్పోయాను. బెడ్‌పై ఒక అబ్బాయి శృంగారంలో పాల్గొనే సామర్థ్యాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అలాగే ఇక చాలు ఆపు అని ఏ అమ్మాయి ఇంతవరకు నాతో చెప్పలేదు. నాకు డేట్‌కు వెళ్లడం నచ్చదు, ఏదైనా కానీ ఇంట్లోనే’ అని ఆర్జీవీ బోల్డ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో అమ్మాయిలేనా ఆంటీలను కూడా ఇష్టపడతారా అని యాంకర్ అడగ్గా.. ఇద్దరూనంటూ వర్మ హాట్ కామెంట్స్ చేశారు. అదే విధంగా అబ్బాయిలు ఆంటీలనే ఎందుకు ఇష్టపడతారనే ప్రశ్నకు.. ‘ఎవరిలో ఉండే అట్రాక్షన్ వారిలో ఉంటుంది. అయితే అనుభవం ఉన్న వాళ్లు ఏ రంగంలోనైనా డామినేట్ చేస్తారు. అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుంది’ అని ఆర్జీవీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More : శృంగారంలో మా ఆయన బాగా సంతోష పెడతారు కానీ.

👉 మరిన్ని సెక్స్ & సైన్స్ వార్తల కోసం సందర్శించండి

Advertisement

Next Story