‘శాకుంతలం’ హీరో సమంత కంటే 5 ఏళ్లు చిన్నోడా!

by Anjali |   ( Updated:2023-04-12 11:38:10.0  )
‘శాకుంతలం’ హీరో సమంత కంటే 5 ఏళ్లు చిన్నోడా!
X

దిశ, సినిమా: అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘శాకుంతలం’ ఒకటి. మరో రెండు రోజుల్లో విడుదలకానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌ జోరుగా నిర్వహిస్తున్నారు. సమంతతో పాటు హీరో దేవ్ మోహన్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే తాజాగా మీడియాతో ముచ్చటించిన దేవ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

‘సమంతగారి కంటే నేను ఐదేళ్ల చిన్నవాడిని. ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. టాలీవుడ్ వాతావరణం, తెలుగు భాష నాకు కొత్త కాబట్టి షూటింగ్ సమయంలో ఏమైనా సందేహాలుంటే అడుగుతాను అని షూటింగ్ తొలిరోజే సమంతకు విజ్ఞప్తి చేశా. ఇక సమంతతో రొమాంటిక్ పాత్రలో నటిస్తానని అనుకోలేదు. ఆమెతో పని చేయడం చాలా ఆశ్చర్యమేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి: మళ్లీ దెబ్బతిన్న సమంత ఆరోగ్యం!

Advertisement

Next Story