ఆ హీరో చెంప పగలగొట్టినా.. అతనిపై ఉమ్మినా.. రూ. 10లక్షల నజరానా..

by Prasanna |   ( Updated:2023-08-12 13:54:17.0  )
ఆ హీరో చెంప పగలగొట్టినా.. అతనిపై ఉమ్మినా.. రూ. 10లక్షల నజరానా..
X

దిశ, సినిమా : ఖిలాడీ అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘OMG 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ గురించి మంచి మెసేజ్ ఇచ్చిన ఈ సినిమా తొలి రోజే రూ. 10కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఇందులో మెసెంజర్ ఆఫ్ గాడ్‌గా కనిపించిన అక్షయ్‌పై మరోసారి విరుచుకుపడ్డాయి హిందూ సంఘాలు. రాష్ట్రీయ హిందూ పరిషత్ భారత్ అతని దిష్టిబొమ్మలను, సినిమా పోస్టర్లను దగ్ధం చేసింది. థియేటర్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ పాత్రలో నటించి హిందూ దేవుళ్లను అవమానించాడని తిట్టిపోసింది. అందుకే శివుడి దూతగా నటించి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన అక్షయ్‌ను చెంపదెబ్బ కొట్టినా, ఉమ్మివేసినా రూ. 10లక్షల బహుమతి అందజేస్తామని ప్రకటించింది.

Read More: ‘భోళా శంకర్’ సినిమా సూపర్ అంటూ నిర్మాత ట్వీట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Advertisement

Next Story