దూసుకుపోతున్న ‘Skanda’.. మొదటి రోజు Collections తో టాప్ మూవీగా రికార్డ్..?

by sudharani |   ( Updated:2023-09-28 14:49:39.0  )
దూసుకుపోతున్న ‘Skanda’.. మొదటి రోజు Collections తో టాప్ మూవీగా రికార్డ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ అండ్ డైనమిక్ హీరో రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘స్కంద’. యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు (గురువారం) రిలీజై పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే.. టాక్ బాగానే వచ్చినప్పటికీ సినిమాపై నెగిటివ్ రివ్వూలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. కానీ, కలెక్షన్లో మాత్రం సత్తా చాటుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టాక్‌తో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్లు భారీగా వచ్చినట్లు వినికిడి. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఏంటి అనేది ఓ లుక్ వేసేద్దామా మరి..

సెలవు రోజు కావడంతో మ్యాట్నీ నుంచి ఈ చిత్రానికి బుకింగ్స్ పెరిగాయి. దీంతో తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రం రూ. 6.50 - 7.50 కోట్లు షేర్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక.. వరల్డ్ వైడ్‌గా కూడా ఇదే క్రేజ్‌లో దూసుకుపోతే ఈ మూవీ ఆశించిన రీతిలో కలెక్షన్లు రాబట్టే అవకాశాలు గట్టిగానే ఉన్నట్లు అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

ఇవి కూడా చదవండి : మాస్ సినిమాలకు బ్రాండ్‌గా రామ్ పోతునేని.. స్కందాతో ఊపందకున్నట్లేనా..?

Advertisement

Next Story