Kushi 2 Movie: ఖుషి 2 స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన SJ సూర్య

by Prasanna |   ( Updated:2024-08-28 14:44:12.0  )
Kushi 2 Movie: ఖుషి 2 స్టోరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన SJ సూర్య
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ అప్పట్లోనే సూపర్ హిట్ గా నిలిచింది. SJ సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, భూమిక కలిసి జంటగా నటించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.

ఈ మూవీలోని పాటలు యూత్ ఇప్పటికి హమ్ చేస్తూనే ఉంటారు. అయితే, ఖుషి తర్వాత SJ సూర్య డైరెక్షన్ లో పులి మూవీ అది ఫ్లాప్ అయింది. తాజాగా SJ సూర్య ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు చెప్పాడు. ప్రస్తుతం, ఈ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

SJ సూర్య సరిపోదా శనివారం మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా SJ సూర్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కి మంచి ప్రేమ కథ చెప్పాను. నా మనసులో ఖుషి 2 అనుకున్నా.. కానీ అతనికి వేరేలా కథ వివరించాను విన్న తర్వాత స్టోరీ ఆయనకి నచ్చింది. ఇప్పుడున్న నా మైండ్ సెట్ కి ప్రేమ కథలు అసలు సెట్ అవ్వవు అని అన్నారు. అలా ఆ కథ అక్కడే ఆగిపోయింది. దీనిపై అభిమానులు ఒక్కోలా రియాక్ట్ అవుతున్నారు. ఖుషి 2 చేసి ఉంటే.. మొదటి స్థానంలో ఉండేవాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story