మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్న ‘Sita Ramam’..

by sudharani |   ( Updated:2023-08-12 03:46:55.0  )
మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకున్న ‘Sita Ramam’..
X

దిశ, వెబ్‌డెస్క్: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూరు, రష్మిక మందన ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘సీతారామం’. ఎమోషనల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ మూవీకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. 2022 ఆగస్టున విడుదలైన ‘సీతారామం’.. దాదాపు రూ. 90 కోట్లు వసూళ్లు రాబ్టటి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే అనేక అవార్డులను సొంతం చేసుకోగా.. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కించుకుంది.

మెల్‌బోర్న వేదికగా ‘ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ ఈవెంట్ అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ వేడుకలను దర్శకుడు కరణ్ జోహార్, హీరో కార్తీక్ ఆర్యన్, నటి మృణాల్ ఠాకూర్, నటుడు విజయ్ వర్మ తదితరులు ప్రారంభించారు. అయితే.. శుక్రవారం రోజు పలు విభాగాలకు చెందిన అవార్డుని నిర్వాహకులు ప్రకటించారు. ఇందులో బెస్ట్ ఫిల్మ్‌గా ‘సీతా రామం’ నిలిచింది. కాగా.. ఈ నెల 20 వరకు ఈ వేడుక జరగనుంది.

Also Read: Jailer మూవీ చూసిన CM Stalin.. డైరెక్టర్ పై ప్రశంసల జల్లు

Advertisement

Next Story