నానితో రొమాన్స్ చేయనున్న " సీతారామమ్ " ముద్దుగుమ్మ

by Prasanna |   ( Updated:2022-12-31 03:08:24.0  )
నానితో రొమాన్స్ చేయనున్న  సీతారామమ్  ముద్దుగుమ్మ
X

దిశ, వెబ్ డెస్క్ : " మృణాల్ ఠాకూర్ " ఈ ముద్దుగుమ్మ పేరు వినగానే మనకి " సీతారామమ్ " సినిమా ప్రేమ కథ గుర్తొస్తుంది. సినిమా రిలీజ్ ముందు వరకు ఈమె ఎవరో కూడా తెలీదు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. సీత పాత్రలో " మృణాల్ ఠాకూర్ " ఆమె అందరితో మంచి మార్కులు వేపించుకుంది. ఈ సినిమా హిట్ అవ్వడంతో ఈమెకు సినిమా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. నాని తన 30 వ సినిమాపై ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. 2023 ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ రానుందని తెలుస్తుంది. ఒక చిన్న పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమాలో నాని సరసన " సీతారామమ్ " ముద్దుగుమ్మ "మృణాల్ ఠాకూర్ " ఓకే చేసినట్టు తెలుస్తుంది . ఈ సినిమాను 2023 జనవరి 1 న అధికారికంగా ప్రకటించనున్నారు.

Advertisement

Next Story