సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సితార.. చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్ట్‌పై సైన్

by sudharani |   ( Updated:2023-05-27 11:16:48.0  )
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సితార.. చిన్న వయసులోనే పెద్ద ప్రాజెక్ట్‌పై సైన్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి అందరకీ తెలిసిందే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఈ స్టార్ కిడ్.. లేటెస్ట్ ఫొటోలు, డాన్స్‌లు షేర్ చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే సితారకు ఇప్పటికే ఇన్‌స్టాలో 12 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. అంతే కాకుండా డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ చానల్ సైతం నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే.. సితార తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో సితారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌‌ను బేస్ చేసుకుని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ఆమెను తన ప్రచారకర్తగా నియమించుకుందట. దీనికోసం సితారకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే సితారతో మూడు రోజుల పాటు యాడ్ షూట్ చేశారట. ఈ యాడ్‌కి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Also Read: అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన సల్లూ భాయ్.. దీపావళికి చూపిస్తాడట..

Advertisement

Next Story