Sir Movie: టాలీవుడ్ హీరోస్ రికార్డును బ్రేక్ చేసిన ధనుష్

by Prasanna |
Sir Movie: టాలీవుడ్ హీరోస్ రికార్డును  బ్రేక్ చేసిన ధనుష్
X

దిశ, వెబ్ డెస్క్ : ధనుష్ తెలుగు ఎంట్రీ మాములుగా లేదుగా..మొదటి సినిమాతోనే రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరాడు. కార్తీ, విక్రమ్ తెలుగులో సినిమాలు చేసిన వంద కోట్లు అయితే దాటలేదు. సార్ మూవీ తో ధనుష్ మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తమిళంలో కంటే తెలుగులోనే సూపర్ హిట్ అయింది.

చదువు, కార్పొరేట్ సంస్థలకు వెళ్లి పెద్ద వ్యాపారంగా ఎలా మారింది? పేద విద్యార్థులకు చదువు ఎలా భారమవుతుందనేది కథ. సార్ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. విజయ్ , అజిత్ సినిమాలకు వచ్చినంత కలెక్షన్స్ ధనుష్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ ఇంత వరకు ఎప్పుడు రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు పర్లేదు అని మాత్రమే అనిపించుకున్నాయి. సార్ సినిమాతో ధనుష్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే రూ. 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ పోస్టర్ను విడుదల చేసారు. తెలుగులో సార్ సినిమాని రూ. 6 కోట్లు పెట్టి ఉంటె రూ.19 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమా హిట్టుతో తెలుగు మూవీస్‌కు సైన్ చేసిన ఆశ్చర్యపడాలిసిన అవసరం లేదు.

Advertisement

Next Story