ఇద్దరిని ప్రేమించి మోసపోయిన సింగర్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-02-16 10:28:07.0  )
ఇద్దరిని ప్రేమించి మోసపోయిన సింగర్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ ఆండ్రియా జెరెమియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సింగర్‌గా రాణిస్తూనే సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆండ్రియా.. ప్రేమ, పెళ్లి వంటి విషయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఆండ్రియా వాలంటైన్స్‌డే సందర్బంగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో ఆండ్రియా రెండు సార్లు ప్రేమ విషయంలో మోసపోయిన సంగతి తెలిసింది. మొదటిది సంగీత దర్శకుడు అనిరుద్‌తో చాలా కాలం ప్రేమ వ్యవహారం నడిపింది. ఈ క్రమంలోనే వీరిద్దరి బోల్డ్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అతడితో విడిపోయిన తర్వాత ఓ పెళ్లి అయిన వ్యక్తిని నమ్మి మోసపోయినట్లు తెలిపింది. కాగా.. ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటూ ఈ పోస్ట్ పెట్టింది. ''ఆమె ప్రేమ రాత్రి లాగే చీకటిగా మారింది'' అంటూ క్యాప్షన్ ఇచ్చి బ్లాక్ కలర్ బ్రా ధరించిన ఫొటో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో ఆ ఫొటో కాస్త బోల్డ్‌గా కూడా ఉండటంతో తెగ వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి: సమంతపై మనోజ్ బాజ్‌పాయ్ సంచలన వ్యాఖ్యలు.. అందుకు సమంత ఏమందంటే..?

Advertisement

Next Story

Most Viewed