- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంస్కారం ఉన్నవాళ్లు అలా మాట్లాడరు.. రెండో పెళ్లి ట్రోలింగ్‌పై సునీత
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత తన జీవితానుభవాలను తలచుకుంటూ కన్నీటి పర్యంతమైంది. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కొన్ని జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయంటూ భావోద్వేగానికి లోనైంది. ముఖ్యంగా ఒకానొక సమయంలో తాను డిప్రెషన్‌లోకి జారుకున్నప్పుడు మెంటర్‌గా వ్యవహరించిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మళ్లీ తనను శక్తివంతమైన మనిషిగా నిలబెట్టారని చెప్పింది. ఇక బాలు అంటే తనకు ఎనలేని భక్తి, అభిమానం అంటూ దింవగత గాయకుడిపై తన గౌరవాన్ని చాటుకుంది.
ఈ క్రమంలోనే రెండో వివాహంపై జరిగిన ట్రోలింగ్ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నలకు బదులిస్తూ.. 'నేను ఎంతో మందికి వినోదాన్ని పంచడానికి కారణమయ్యాను అంటున్నారు. అలాంటపుడు నాలో ఇన్ని మంచి విషయాలు కనిపిస్తుండగా ఎందుకు వ్యక్తిగత జీవితం గురించి డిస్కస్ చేస్తారు. ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఏం మాట్లాడుతాన్నామో ఒకసారి ఆలోచించాలి. సంస్కారవంతమైన లక్షణాలు కలిగి ఉండాలి' అంటూ తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.