అసలు ఆయనకు అది లేదు.. అందుకే విడాకులు తీసుకున్న.. నటి కామెంట్స్

by sudharani |   ( Updated:2023-07-12 07:36:48.0  )
అసలు ఆయనకు అది లేదు.. అందుకే విడాకులు తీసుకున్న.. నటి కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ సుచిత్రా కృష్ణమూర్తి.. తన మాజీ భర్త అయినా బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్‌తో ప్రేమ, పెళ్లి, విడాకుల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ‘‘శేఖర్ కపూర్‌తో పెళ్లి మా తల్లిదండ్రులకు ఇష్టం లేదు. అతడు నాకంటే పెద్దవాడు కావడం.. పైగా అప్పటికే వేరే మహిళతో విడాకులు తీసుకోవడంతో మా వాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ.. అప్పట్లో ఆయన్ని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా.. నువ్వు పెళ్లిచేసుకోకపోతే జీవితంలో మళ్లీ కనిపించను అని బెదిరించారు. దీంతో నేను 1999లో శేఖర్ను వివాహమాడాను. ఆ తర్వాత అతను సినిమాల్లో నటించొద్దన్నారు. అదేమి నాకు పెద్ద విషయం అనిపించకపోవడంతో నేను మరో ఆలోచన చేయకుండా ఆయన మాటకు అంగీకరించాను. కానీ, కొన్నాళ్లకు నన్ను మోసం చేసి వెళ్లిపోయారు. అతనిలో నిజాయితీ లేదు. దీంతో జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాను. అందుకే 2007లో విడిపోయాం’’ అంటూ చెప్పుకొచ్చారు

Read More: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. BRO కటౌట్లో అభిమానుల ఫొటోస్ స్కెచ్

Advertisement

Next Story