షూటింగ్లో సింగర్ మంగ్లీ కాలికి గాయం.. ఏమి జరిగిందంటే?

by Prasanna |   ( Updated:2023-06-26 04:41:45.0  )
షూటింగ్లో సింగర్ మంగ్లీ కాలికి గాయం.. ఏమి జరిగిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన ఆమె ప్రైవేట్ సాంగ్స్ తో పాపులారిటీ తెచ్చుకుంది. ఇక సినిమాల్లో కూడా మాస్ పాటలకు కేర్ ఆఫ్ గా నిలిచింది. తక్కువ సమయంలో నే 100కి పైగా పాటలు పాడింది. పాటలు మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అయితే తాజాగా మంగ్లీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బోనాలపై ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ చేస్తున్న సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి గాయం అయిందని తెలిసిన సమాచారం. మంగ్లీకి కొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్స్ సూచించారు.

Also Read: జిమ్‌లో చెమటోడ్చుతున్న పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ (వీడియో)

Advertisement

Next Story