వేదికపై ఉండగానే గర్భస్రావం.. పుట్టెడు దుఃఖంలో స్టార్ సింగర్

by Aamani |   ( Updated:2023-04-09 08:50:26.0  )
వేదికపై ఉండగానే గర్భస్రావం.. పుట్టెడు దుఃఖంలో స్టార్ సింగర్
X

దిశ, సినిమా : ప్రముఖ గాయని లారా బెనాంటి తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఏప్రిల్ 3న ఓ వేదికపై ప్రదర్శన చేస్తున్నప్పుడు తనకు గర్భస్రావం జరిగిందని తెలిపింది. ఈ బాధకరమైన విషయాన్ని ఇన్‌స్టా‌వేదికగా పంచుకుంటూ ‘నేను గర్భస్రావం అవుతూనే నా ముందున్న 2వేల మందిని అలరించాను. అయితే ఇలా జరుగుతుందని ముందే తెలుసు. గత రాత్రి ఇది నెమ్మదిగా మొదలైంది. దురదృష్టవశాత్తు నేను గర్భం కోల్పోవడం మొదటిసారి కాదు. నేను మోయాలనుకున్న బిడ్డను భూ దేవత ముందే తీసుకెళ్లి పోయింది. నా భర్త, నేను హృదయవిదారకంగా ఉన్నాం. అయినప్పటికీ చాలా దయగల, అత్యంత ప్రేమగల మనుషులతో కలిసి నడిచినందుకు ఆనందంగా ఉంది. నా చుట్టూ చేరి అమితమైన ప్రేమను పంచిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. నన్ను దుఃఖం నుంచి బయటపడేసిన నా బృందానికి, స్నేహితులకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: ‘లో’ దుస్తులు లేకుండా నటి ఫొటో షూట్.. టాప్ టూ బాటమ్ ఓపెన్

Advertisement

Next Story