విడాకులు తీసుకోబోతున్న సింగర్ గీతా మాధురి.. క్లారిటీ ఇచ్చిన భర్త నందు!

by Hamsa |   ( Updated:2023-10-21 05:53:29.0  )
విడాకులు తీసుకోబోతున్న సింగర్ గీతా మాధురి.. క్లారిటీ ఇచ్చిన భర్త నందు!
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ గీతా మాధురి, నటుడు నందు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ జంటకు ఓ కూతురు కూడా ఉంది. అయితే, వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ప్రచారం జరుగుతోంది. మనస్పర్థల కారణంగా ఇద్దరు విడిపోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా, గీతా మాధురి భర్త నందు ‘మాన్షన్24’ ప్రమోషన్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విడాకులపై క్లారిటీ ఇచ్చాడు. ‘‘ విడాకుల వార్తల్లో నిజం లేదు. ఇలాంటి వార్తలు చూసి మేము ఇద్దరం నవ్వుకున్నాము. ఎవరో ఏదో రాసినంత మాత్రాన మేము స్పందించాల్సిన అవసరం లేదని అనుకున్నాము కానీ ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు స్పందించాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం నందు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More: ‘pushpa-2’ సినిమాలో మెగాస్టార్ chiranjeevi .. హింట్ ఇచ్చిన డైరెక్టర్ ప్లాన్ అదిరిందిగా!

Advertisement

Next Story