Emergency: ఏపీలో ఎనిమిదేళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసిన మైనర్లు.. పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తున్న జనం...

by Sujitha Rachapalli |
Emergency: ఏపీలో ఎనిమిదేళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేసిన మైనర్లు.. పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తున్న జనం...
X

దిశ, సినిమా: ఏపీలో ఎనిమిదేళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ సంచలనం సృష్టిస్తుంది. అది కూడా ముగ్గురు మైనర్లు నిందితులుగా ఉండటం ఆందోళన కలిగించే విషయం. కాగా ఈ ఇష్యూపై స్పందించింది సింగర్ చిన్మయి. బాధితురాలు మూడో తరగతి చదువుతుండగా.. నిందితుల్లో ఇద్దరు ఆరో తరగతి, ఒకరు ఏడో తరగతి చదువుతున్నారని గుర్తు చేసింది. ఈ సంఘటన మనలో ఆలోచన కలిగించాలని.. స్కూల్స్ లో సెక్స్ ఎడ్యుకేషన్ తీసుకురావాల్సిన ఎమర్జెన్సీ టైమ్ వచ్చిందని చెప్పింది. ఇకనైనా ప్రభుత్వాలు ఈ వైపుగా ఆలోచించాలని సూచించింది. ఈ సంఘటన కల్చర్ బ్రేక్ చేసిందనేది వాస్తవం అని చెప్పుకొచ్చింది.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. 'మా రాష్ట్రానికి పట్టిన దరిద్రం సినిమా వాళ్లు. ఇప్పుడు తమను ఏలుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవి జరుగుతున్నాయి ' అని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ను తిట్టిపోస్తున్నారు కొందరు. ఆన్ లైన్ లో పోర్న్ కంటెంట్ చిన్నారులకు అందుబాటులో ఉండటం వల్లే ఇలా జరుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ వయసులో సెక్స్ గురించి ఏం తెలుసని ఆశ్చర్యపోతున్నారు ఇంకొందరు.

Advertisement

Next Story

Most Viewed