టైట్‌గా ఉంటేనో, బ్లెడ్ వస్తేనో వర్జిన్ కాదు.. ప్రముఖ సింగర్ వీడియో వైరల్

by sudharani |   ( Updated:2023-05-19 12:09:29.0  )
టైట్‌గా ఉంటేనో,  బ్లెడ్ వస్తేనో వర్జిన్ కాదు.. ప్రముఖ సింగర్ వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే చిన్మయి.. సొసైటీలో జరిగే అసాంఘిక విషయాలపై స్పందిస్తూ వైరల్ అవుతుంటారు. ముఖ్యంగా మహిళలపై జరిగే అఘాయిత్యాలపై సోషల్ మీడియాలో తన గొంతు వినిపిస్తూ ఉంటుంది. మహిళల పర్సనల్ విషయాలపై కూడా ఎంతో ధైర్యంగా మాట్లాడే చిన్మయి.. తాజాగా ఇలాంటి విషయమై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ విడుదల చేసింది.

పెళ్లి అయిన అబ్బాయిలు ఫస్ట్ నైట్ రోజు ఒకటి ఊహించుకుంటే రియాల్టీ వేరేల ఉంటుంది అని అమ్మాయి క్యారెక్టర్‌ను కించపరిచేలా ఓ వీడియో ఎవరో పోస్ట్ చేశారు. ఆ వీడియోను లింక్ చేస్తూ చిన్మయి తన దైన శైలిలో వివరణ ఇచ్చింది. ‘‘అమ్మాయిలకు తొలికలయికలో నొప్పి ఉంటుందని, వెజినా టైట్‌గా ఉంటుందని.. లేక రక్తం వస్తేనో వర్జిన్ అని అనుకుంటారు చాలా మంది. అదంతా కేవలం అపోహ మాత్రమే. నిజానికి తొలి కలయిక సమయంలో అమ్మాయిలకు నొప్పి, బాధ లాంటివి ఉంటే అది వైద్య పరంగా పెద్ద సమస్య. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ఇలాంటి విషయాలు మాట్లాడడానికి సిగ్గు పడకూడదు. కానీ సమాజం ఇప్పటికీ అదే విధంగా వ్యవహరిస్తుంది. ఇలా తొలి కలయికపై వచ్చే ట్రోల్స్, జోకులు, మీమ్స్ ఇవన్నీ నిజం కాదు’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. చిన్మయి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story