సింహాద్రి రీరిలీజ్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?

by sudharani |   ( Updated:2023-05-22 04:11:22.0  )
సింహాద్రి రీరిలీజ్.. ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘సింహాద్రి’. 2003 లో రిలీజైన ఈ సినిమాను.. నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా రీరిలీజ్ చేశారు. 4కే వెర్షన్‌లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో సందడి చేసింది. ఓవర్సీస్ అయినా అమెరికా, ఆస్ట్రేలియాలో ‘సింహాద్రి’కి మంచి రెస్పాన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా కొత్త సినిమాలకు పోటీగా బుక్ అయ్యాయని తెలుస్తుంది.

కాగా.. ఓవరాల్‌గా ‘సింహాద్రి’ సినిమా రీరిలీజ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నైజాం రూ. 1.10 కోట్లు, సీడెడ్ రూ. 0.78 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 1.56 కోట్లు, కర్ణాటక రూ. 0.32 కోట్లు, తమిళనాడు రూ. 0.13 కోట్లు, RoI రూ. 0.34 కోట్లు, USA రూ. 0.46 కోట్లు, RoW రూ. 0.47 కోట్లు వసూలు చేయగా.. టోటల్ గ్రాస్ రూ. 5.14 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

Also Read....

Jr.NTR: ఆ విషయంలో ఎన్టీఆర్ బాధను ఎవరు తీర్చలేరట?

‘జై ఎన్టీఆర్’.. నందమూరి అభిమానుల హృదయాలు గెలుచుకున్న Ram Charan !

Advertisement

Next Story