సింహాద్రి సినిమా రీ రిలీజ్.. థియోటర్లో రమా రాజమౌళి హంగామా..! (వీడియో)

by Nagaya |   ( Updated:2023-09-09 14:05:14.0  )
సింహాద్రి సినిమా రీ రిలీజ్.. థియోటర్లో రమా రాజమౌళి హంగామా..! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో 2003లో రిలీజై అఖండి విజయం అందుకున్న మూవీ సింహాద్రి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, భూమిక జంటగా నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించగా.. ఇప్పటికీ ఆ పాటలు ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. 2003 జూలై 9న విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రూ.8.5 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం రూ.26 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రాన్ని తరువాత తమిళంలో గజేంద్రగా, కన్నడలో కంఠీరవ, బంగ్లాదేశ్‌లో బెంగాలీలో దుర్దోర్షో గా రీమేక్ చేశారు.

కాగా, సింహాద్రి సినిమాను నేడు రీ రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన ఈ సినిమాను చూడటానికి అభిమానులు థియోటర్లకు పోటెత్తారు. హైదరాబాద్‌లోని సంధ్య థియోటర్లను ఈ మూవీని చూడటానికి రమా రాజమౌళి వచ్చి అభిమానులు మధ్య తిలకించారు. ఈ సందర్భంగా అభిమానులు సింహాద్రి సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆ వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి.

Advertisement

Next Story