కియారా బ్రేకప్.. కరణ్ జోహార్ చేసిన పనికి..

by Sathputhe Rajesh |
కియారా బ్రేకప్.. కరణ్ జోహార్ చేసిన పనికి..
X

దిశ, సినిమా : బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా - కియారా అద్వానీ బ్రేకప్ న్యూస్ విని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కొన్ని రోజులకే ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారనే వార్తతో సంతోషపడ్డారు. అయితే ఇందులో కరణ్ జోహార్ జోక్యం ఉందని తెలుస్తోంది. సిద్ధు, కియారాకు ఆప్తమిత్రుడైన కరణ్.. మరోసారి ఆలోచించాలని, అర్థం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుందని సలహా ఇచ్చాడని సమాచారం. ఆయన మాటలకు కన్విన్స్ అయిన ఇద్దరు.. వర్క్ కమిట్మెంట్స్ పూర్తి కాగానే వెకేషన్‌కు వెళ్తున్నారట. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అవుతుందని అంటున్నారు అభిమానులు. లైఫ్‌లో ఒక చాన్స్ ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పులేదని, సిద్ధు-కియారా అదే చేశారని అంటున్నారు.


Advertisement

Next Story