మ్యారేజ్ వద్దు.. డేటింగ్ ముద్దు : కూతురుకి పెళ్లి చేయనంటున్న శ్వేత

by Hajipasha |   ( Updated:2022-09-11 11:35:29.0  )
మ్యారేజ్ వద్దు.. డేటింగ్ ముద్దు : కూతురుకి పెళ్లి చేయనంటున్న శ్వేత
X

దిశ, సినిమా: టెలివిజన్ నటి శ్వేతా తివారీ తన కూతురు పాలక్ తివారీని పెళ్లి చేసుకోవద్దని కోరినట్లు వెల్లడించింది. ఎందుకంటే తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని, పెళ్లి అనే బంధం జీవితాన్ని నడిపించకూడదని కోరుకుంటున్నట్లుగా చెప్పింది. అలాగే ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే అది మ్యారేజ్‌కు దారితీయాల్సిన అవసరం లేదన్న ఆమె.. '12 ఏళ్ల వయసున్నపుడే పాలక్ తన తండ్రి రాజా చౌదరి నాపై చేసిన అకృత్యాలను దగ్గరనుంచి చూసింది. తన ముందే ఆయన నన్ను చాలాసార్లు కొట్టాడు. దారుణంగా వేధించాడు.

అయినప్పటికీ ఏదో ఒకరోజు మళ్లీ ప్రేమిస్తాడని, మంచిగా చూసుకుంటాడని ఆశతో ఎదురు చూశాను. అయినా తనలో మార్పు కనిపించలేదు. అందుకే విడాకాలిచ్చేశా' అని చెప్పుకొచ్చింది. ఇక కుమార్తెను కలవడానికి తనను అనుమతించట్లేదంటూ తప్పుడు వాదనలు చేశాడన్న నటి.. దీంతో అతినిపై ఉన్న గౌరవం, మగాళ్ల ప్రేమపై ఉన్న నమ్మకం పూర్తిగా ధ్వంసమై పోయినట్లు తెలిపింది.

Advertisement

Next Story