- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో ఏ హీరో చేయలేనిది మా నాన్నే చేస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ కిడ్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చింది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. రీసెంట్ గా ‘సాలర్’ తో హిట్ అందుకున్న ఈ చిన్నది ప్రస్తుతం అడివి శేష్ సరసన ‘డెకాయిట్’ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతోపాటుగా ‘చెన్నై స్టోరీ’ ‘సాలర్ పార్ట్-2’ వంటి ప్రాజెక్ట్‌ల్లో కూడా నటించబోతోంది. ఇక పోతే ఆఫ్ స్క్రీన్ అయిన ఆన్ స్క్రీన్ అయిన బహిరంగంగా మాట్లాడుతుంది శృతి హాసన్. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలైనా, ఆరోగ్య సమస్యలు, కెరీర్ గురించి ఎలాంటి దాపరికం లేకుండా పంచుకుంటుంది. అంతేకాదు ఎవరి గురించి అయినా సరే బోల్డ్ కామెంట్స్ చేయడానికి కూడా వెనకడుగు వేయదు.
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా హీరోలపై ఓ సవాల్ విసిరింది ఈ చిన్నది. ‘ ప్రతి ఒక నటీనటులు కొత్త మార్గాల్లో అడుగుపెట్టాలని కోరుకుంటారు. కానీ చాలా మంది హీరోలకు ప్రయత్నించే ధైర్యం ఉండదు. ఈ విషయంలో మా నాన్న కమల్ హాసన్ ప్రత్యేకం అని చాలా సార్లు నిరూపించారు. ఆయన కథల ఎంపిక ఇతర నటీనటులకు భిన్నంగా ఉంటుంది. నాన్న ధైర్యం మిగతా వారి నుండి వేరుగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నా తల్లి ఉంటే నా కెరీర్ మరోలా ఉండేది. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఏదేమైనా నా కెరీర్ ను సంగీతం, సినిమాలు రెండింటినీ కొనసాగిస్తాను’ అని పేర్కొన్నది శృతి. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
- Tags
- Shruti Haasan