- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ సినిమాలో తన పాత్రపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్..!
దిశ, సినిమా: రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస పాన్ ఇండియా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ఇందులో డిసెంబర్ 22న మొదటి భాగాన్ని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి ఈ అమ్మడు వైరల్ కామెంట్స్ చేసింది.
‘ఈ సినిమాలో నేను ఉన్న కదా అని అందరూ అనుకోవచ్చు. నటిస్తున్నాను కానీ అది పూర్తిగా ప్రభాస్ సినిమా. ప్రభాస్ చాలా కష్టపడి తన కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎంతో కష్టపడి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంత ఇంపార్టెంట్ అయినప్పటికీ మూవీ బ్లాక్ బస్టర్ కావాలంటే హీరో వల్లే సాధ్యం అవుతుంది. అందుకే స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్స్ కొన్నిసార్లు మాత్రమే కనిపిస్తారు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లుగా ఉంటారు’ అని తెలిపింది శృతిహాసన్.