Shruti Haasan : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న శృతి హాసన్.. క్లారిటీ

by Aamani |   ( Updated:2024-01-04 15:02:32.0  )
Shruti Haasan : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న శృతి హాసన్.. క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గా ముద్దుగుమ్మ శృతిహాసన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సంవత్సరంలో మాత్రం శృతి హాసన్ చేసిన ప్రతి ఒక్క సినిమా హిట్ అయింది. అయితే శృతిహాసన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ వార్తలను ఆమె కొట్టిపడేశారు. తన బాయ్ ఫ్రెండ్ హజారికను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వదంతులపై ఆమె స్పందించారు. 'నేను హజారికాను పెళ్లి చేసుకోలేదు. ప్రతి విషయం గురించి చెప్పే నేను పెళ్లి విషయాన్ని ఎందుకు దాస్తాను. ఇకనైనా ట్రోలర్స్ శాంతించండి' అని శ్రుతిహాసన్ ట్వీట్ చేశారు. మరోవైపు 'మాకు పెళ్లి కాలేదు. దయచేసి వదంతులు ఆపండి' అని శాంతను హజారికా సైతం పోస్ట్ పెట్టారు. ఇక శృతిహాసన్ గత కొద్ది రోజులుగా డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతాను హాజరిక తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story