నటనకు గుడ్ బై చెప్పి ఆ పని చేయబోతున్న శృతి హాసన్

by Prasanna |   ( Updated:2023-12-04 14:19:40.0  )
నటనకు గుడ్ బై చెప్పి ఆ పని చేయబోతున్న శృతి హాసన్
X

దిశ, సినిమా: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్.. తన నటన, అందంతో సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తండ్రికి తగ్గట్టుగానే విలక్షణమైన నటిగా పేరు సంపాదించుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా సింగర్‌గా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్‌గా విడుదలైన స్పెషల్ సాంగ్‌తో ఫిదా చేసింది కూడా. అయితే ఈ సినిమాలో ఈమె పాట పాడి డ్యాన్స్ చేసినందుకుగాను దాదాపుగా కోటి రూపాయల వరకు తీసుకుందని సమాచారం. కాగా దీంతో శృతి రాబోయే రోజుల్లో నటనకు విరామం ఇచ్చి, సంగీతం వైపుగా దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story