Shruti Haasan : ఆ పాత్రలో నటించబోతున్న శృతిహాసన్‌..

by Kavitha |   ( Updated:2024-01-28 04:07:05.0  )
Shruti Haasan : ఆ పాత్రలో నటించబోతున్న శృతిహాసన్‌..
X

దిశ, సినిమా: ప్రజంట్ మంచి ఫామ్ లో దూసుకుపోతుంది హీరోయిన్ శృతి హాసన్. గత ఏడాది తెలుగు లో ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘సలార్‌’, ‘హాయ్‌ నాన్న’ వంటి బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ తో వచ్చి మంచి విజయాలను అందుకుంది. ఈ క్రమంలో కథల ఎంపికలో మరింత వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుందట శృతిహాసన్‌.

ఇందులో భాగంగా తాజా సమాచారం ప్రకారం తమిళంలో ‘వేలు నాచ్చియార్‌’ అనే వీర వనిత పాత్రలో నటించబోతున్నదట. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్ని వీర వనితగా పేరు తెచ్చుకున్న వేలు నాచ్చియర్ గొప్పతనం.. గురించి మనకు తెలిసిందే. ఇక కథలోని దేశభక్తి అంశాలు, తన పాత్రలోని ధీరత్వం నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు శృతిహాసన్‌ ఓకే చెప్పిందని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు శృతి ని గ్లామర్ బ్యూటిగానే చూసాం. ఇప్పుడు మొదటి సారిగా ఒక ధీర వనిత గా చూడబోతున్నాం. దాదాపు నాలుగేళ్ల తర్వాత మాతృభాష తమిళంలో శృతిహాసన్‌ నటించబోతున్న ఈ చిత్రంలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story