కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఫొటోస్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-01 06:50:49.0  )
కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ‘కాన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2023’ వేడుకలు ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో ప్రపంచ సినిమా తారలు పాల్గొని సందడి చేస్తున్నారు. ఇండియా నుంచి మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్, ఊర్వశి రాతెలా అలాగే శృతి హాసన్ పాల్గొన్నారు. అయితే శృతి హాసన్ మాత్రం ఈ వేడుకలకు తన బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు లండన్ వీధుల్లో తన కొత్త ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే గతంలో శృతి హాసన్ లండన్‌కి చెందిన మైకెల్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో వాళ్లు ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ, అనూహ్య రీతిలో 2019లో ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక, ఇప్పుడు ఈ కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి.. అతడితోనైనా వివాహం వరకు వెళుతుందా..? అంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : అడవి శేషుకి ఆ స్టార్ యాంకర్‌తో ఎఫైర్ నిజమేనా?

Advertisement

Next Story