Shriya Saran: ఆ విషయంలో నా పిల్లలు గర్వంగా ఫీల్ అవ్వాలి: స్టార్ నటి

by Prasanna |   ( Updated:2023-03-01 05:37:46.0  )
Shriya Saran: ఆ విషయంలో నా పిల్లలు గర్వంగా ఫీల్ అవ్వాలి: స్టార్ నటి
X

దిశ, సినిమా : స్టార్ నటి శ్రియా శరణ్.. తను నటించిన సినిమాలు చూసి తన పిల్లలు గర్వపడాలంటోంది. ఆమె కీలకపాత్ర పోషించిన తాజా మూవీ ‘కబ్జా’ మార్చి 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న నటి.. కెరీర్, వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించింది. ‘కోలీవుడ్‌ ఇండస్ట్రీ నాకు మంచి లైఫ్ ఇచ్చింది. గొప్ప చిత్రాల్లో నటించే అవకాశం కల్పించింది. స్టార్ డైరెక్టర్ శంకర్‌ వంటి వాళ్లతో పనిచేసే ఛాన్స్‌ రావడం నా అదృష్టం. కరోనా కారణంగా కొంత గ్యాప్‌ వచ్చినా.. ఇప్పుడు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నా. మంచి కథలు వస్తే మాత్రం వదులుకోను. నా కెరీర్ మొత్తంలో నటించిన సినిమాలు చూసి నా కుతూరు గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏ రోజు బాధపడకూడదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read: ఆ సినిమాలు రిమేక్ చేయడం నాకు ఇష్టంలేదు: కాజోల్

Advertisement

Next Story