- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలీవుడ్ వెబ్‌సిరీస్ తో OTT ఎంట్రీ ఇస్తున్న శ్రియ శరణ్..!
దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన హీరోయిన్ శ్రియ శరణ్.చిరంజీవి నుంచి బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోల సరసన కూడా నటించి హీరోయిన్ భారీ విజయాలు అందుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఇప్పుడు శ్రియ ఓటీటీ ఎంట్రీ కి రెడీ అయింది. ప్రముఖ ఓటిపి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ రూపొందించిన ఓ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో శ్రియ శరణ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది.
సుమిత్ రాయ్ దర్శకత్వంలో ‘షో టైం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, మౌని రాయ్, నసీరుద్దీన్ షా రాజీవ్ ఖండేల్వాల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ తన ప్రొడక్షన్ బ్యానర్ ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తెరకెక్కుతున్నఈ వెబ్ సిరీస్ మార్చి 8న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఇక తాజాగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అప్డేట్ మేరకు ఓ వీడియో రిలీజ్ చేస్తూ అందరి క్యారెక్టర్‌లు పరిచయం చేశారు. చూస్తుంటే కాన్‌సెప్ట్ కొత్తగా ఉన్నట్లుగా తెలుస్తోంది.